
టపాసుల విక్రయాలకు అనుమతులు తప్పనిసరి
శ్రీకాకుళం పాతబస్టాండ్: దీపావళి టపాసుల విక్రయాలు జరిపేందుకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలసి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల వద్ద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
11 అర్జీల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్‌తో పాటు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వినతులు స్వీకరించారు. 11 శుక్రవారాల్లో 169 అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి నెలా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రై సైకిల్స్, బ్యాటరీ ట్రై సైకిల్స్ మరమ్మతులకు గురైతే వాటి మరమ్మతులకు జిల్లా పరిషత్‌లో ఒక రూం కేటాయించి అక్కడే మరమ్మతులు చేపడతారని చెప్పారు. ఈ వారం స్వాభిమాన్‌కు 11 అర్జీలు అందాయి. అర్జీల స్వీకరణలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు.