
‘విద్యా ప్రమాణాల పెంపునకు కృషి’
కంచిలి: గురుకుల విద్యాలయాల్లో విద్యా ప్రమాణా లు మునుపటి కంటే పెంచడానికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా గురుకుల విద్యాసంస్థల సమన్వయకర్త వై.యశోదలక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రం కంచిలిలో గల డాక్టర్ బీఆ ర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆమె పాఠశాల భవనాలను, డార్మిటరీ భవనా న్ని పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి, వారి అవసరాలను తెలుసుకొన్నారు. అనంతరం గురుకులంలో సేవలందిస్తున్న అధ్యాపకులు, ఉపాధ్యాయు లు, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావుతోనూ మాట్లాడా రు. గురుకుల సమస్యలను కలెక్టర్‌కు నివేదిస్తానని తెలిపారు. భోజనశాలలో పనిచేస్తున్న సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఆమెకు గురుకుల ప్రిన్సిపా ల్ పి.శ్రీనివాసరావు సహకరించారు.