
ముగిసిన జిల్లాస్థాయి స్కూల్ క్రికెట్ పోటీలు
విజేతగా నిలిచిన ఏపీ మోడల్ స్కూల్ పురుషోత్తపురం
రన్నరప్‌తో సరిపెట్టుకున్న శ్రీకాకుళం శ్రీచైతన్య స్కూల్
శ్రీకాకుళం న్యూకాలనీ: పది రోజుల పాటు కన్నుల పండువలా సాగిన జిల్లాస్థాయి అంతర్ పాఠశాలల క్రికెట్ పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జెడ్‌సీఎస్ స్కూల్‌గేమ్స్ హర కేశవ మెమోరియల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ 2025 సీజన్–1 చాంపియన్ ట్రోఫీని ఏపీ మోడల్ స్కూల్ పురుషోత్తపురం కై వసం చేసుకుంది. రన్నరప్‌గా శ్రీకాకుళంలోని మహాలక్ష్మినగర్‌కాలనీలో ఉన్న శ్రీచైతన్య (బ్రాంచ్–1) నిలిచింది. శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానం వేదిక గా జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్ పర్యవేక్షణలో ఈ నెల 8వ తేదీన ఈ పోటీ లు మొదలయ్యాయి. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీచైతన్య స్కూల్ 66 పరుగులు మాత్రమే చేయగా, ప్రతిగా బ్యాటింగ్ మొదలుపెట్టిన ఏపీఎంఎస్ పురుషోత్తపురం మూడు వికెట్లు కోల్పోయి విజ యం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో రాణించిన శ్యామ్‌సుందర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక య్యాడు. అలాగే టోర్నీలో అత్యద్భుతమై ఆటతీరు తో రాణించినవారిలో బెస్ట్ బౌలర్‌గా హరికృష్ణ, బెస్ట్ బ్యాటర్‌గా సాత్విక్, బెస్ట్ ఫీల్డర్‌గా లిలిత్, మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా శ్రీరామ్ ప్రత్యేకంగా బహుమతులు అందుకున్నారు. విజేతలకు ట్రోఫీలు, బహుమతులను జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, విద్యుత్‌ట్రాన్స్‌కో అధికారి రామకృష్ణ, ప్రసన్నకుమార్ బహూకరించారు.