
భూమి లాక్కుంటున్నారు..
ఆమదాలవలస: తన భూమిని లాక్కునేందుకు జనసేన పార్టీ ఎంపీటీసీ అంపిలి విక్రమ్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆమదాలవలస పట్టణానికి చెందిన మహిళ చింతు విజయ ఆరోపించారు. ఆమె గురువారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడారు. తాను బూర్జ మండలం కొల్లివలస గ్రామంలో 20 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని, అదే భూమిని చేజిక్కించుకోవాలని అంపిలి విక్రమ్, వాళ్ల బావ పాండ్రంకి తారక్‌లు నాలుగేళ్లుగా తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆమె చెప్పారు. సరుబుజ్జిలి తహసీల్దార్ రమణారా వు భూమి కొలతలకు వచ్చినప్పుడు కూడా వారిద్ద రూ పెట్రోలు పోసి సైట్ ఖాళీ చేయాలని బెదిరించా రని పేర్కొన్నారు. కారుతో వెంబడించడం, రాత్రిళ్లు ఇంటి వద్ద రాళ్లు వేయించడం వంటి పనులు చేశార ని ఆరోపించారు. తాను కోర్టును ఆశ్రయించగా, కోర్టు తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, ఆ ఆర్డర్‌ను తహసీల్దార్ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్‌కు సమర్పించానన్నారు. అయినా వేధింపులు ఆగడం లేదని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.