
ఎచ్చెర్ల ఎంపీపీపై పీడీ యాక్ట్
● విజయవాడలో ఎచ్చెర్ల ఎంపీపీ ఎం.చిరంజీవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
● ఖాకీల తీరును ఖండించిన ఎంపీపీ వర్గీయులు
● ఫరీద్‌పేటపై నిఘా పెట్టాం: ఎస్పీ మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిని మంగళవారం రాత్రి జిల్లా పోలీ సులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్ కింద అరెస్టు చేస్తున్నట్లు చెప్పి విశాఖ కారాగారానికి తరలించారు. దీంతో ఎంపీపీ వర్గీయులు, ఫరీద్‌పేట గ్రామస్తులు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. గ్రామంలో హత్యలు జరిగాయని, లెక్కకు మించి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని వదిలేసి ఒక్క ఎంపీపీ చిరంజీవి పైనే పీడీ యాక్టు పెట్టడం సరికాదని అన్నారు. అయితే శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే వారు కావ డం వల్లనే ఎంపీపీపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చెబుతున్నారు.
ఇది అన్యాయం
ఎంపీపీ చిరంజీవిని పీడీ యాక్ట్‌పై పోలీసులు అరెస్టు చేయడం అన్యాయం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఫరీద్‌పేటలో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను చంపేశారు. మళ్లీ ఇప్పుడు అదే వర్గానికి చెందిన ఎంపీపీ చిరంజీవిని ఊరి నుంచి తరిమేందుకే చూస్తున్నారు. ఇది న్యాయమా..?
– మొదలవలస సతీష్, ఫరీద్‌పేట
చంపిన వారిని అరెస్టే చేయలేదు
వైఎస్సార్ సీపీకి చెందిన కూన ప్రసాద్‌ని గత ఏడాది చంపేశారు. అందులో ఇద్దరు ముద్దాయిలను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. నాలుగు నెలల కిందట మరో వైఎస్సార్ సీపీ కార్యకర్త గోపిని చంపేశారు. అదే కేసులో బెయిల్‌పై వచ్చి న ముద్దాయిలు రోజూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా నాయకుడు చిరంజీవిని ఇలా ఇరికించడం అన్యాయం.
– మొదలవలస ఫాల్గుణ, ఫరీద్‌పేట
రాజకీయం చేస్తున్నారు..
వైఎస్సార్ సీపీ వాళ్లని చంపేసి.. తిరిగి అదే వర్గానికి చెందిన మా నాయకుడిని అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారు. చంపిన వారిని విడిచిపెట్టి ఎంపీపీని అక్రమ అరెస్టు చేశారు. ఒక వైపే ఇలా చేస్తూ రాజకీయం చేస్తున్నారు. న్యాయపరంగా ఎదుర్కొంటాం. – కూన కిరణ్, ఫరీద్‌పేట
అన్ని గ్రామాలపై దృష్టి పెట్టాం
ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిపై 14 కేసులు ఉన్నాయి. ఫరీద్‌పేటలో గడిచిన రెండు హత్యాఘటనల నాటి నుంచి నిఘా పెట్టాం. 33 మందిని గుర్తించాం. ఒక్క ఫరీద్‌పేటలోనే కాదు జిల్లాలో ప్రతి చోటా శాంతి భద్రతలకు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించేవారి లి స్టు మా వద్ద ఉంది. అలాంటి వారిపై ఒక్కొక్కరి గా రౌడీ షీట్లు, సస్పెక్టు షీట్లు, ఆపై పీడీయాక్టులు పెడుతున్నాం. నిఘాలో ఎంపీపీ శాంతిభద్రతలను విఘాతపరిచే వ్యక్తిగా నిర్ధారణ కావ డంతో కలెక్టర్‌కు నివేదిక పంపి ఆయన ఉత్తర్వులతోనే పీడీ యాక్టు పెట్టాం.– మహేశ్వర రెడ్డి, ఎస్పీ

ఎచ్చెర్ల ఎంపీపీపై పీడీ యాక్ట్

ఎచ్చెర్ల ఎంపీపీపై పీడీ యాక్ట్