
అధికారుల తనిఖీలు.. బెంబేలెత్తిన వ్యాపారులు
సారవకోట: మండల కేంద్రంలో గురువారం విశాఖపట్నం నుంచి ఫుడ్ కంట్రోలర్ ఎస్.ఈశ్వరి, జిల్లాకు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో వ్యాపారులంతా బెంబేలెత్తారు. రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారని తెలిసి అందరూ దుకాణాలు మూసివేశారు. తాము పరిశీలించిన దుకాణాల్లో తేదీల లేపా లు లేవని వారు తెలిపారు. వ్యాపారాలు చేసుకునే వారు స్వలాభం తగ్గించుకుని ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉన్న వస్తువులు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు.