
ప్రమాద స్థలం పరిశీలన
నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలోని భవానీ పురంలో బుధవారం రాత్రి సంభవించిన ప్రమాదంపై టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆరా తీశారు. ప్రమాద సంఘటన స్థలాన్ని గురువారం పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్ర మాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ ప్రమాదం దురదృష్టకరమని, ఇందులో ఏడుగురు గాయపడ్డారని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన అగనంపూడి రాధ, ఆమె కుమార్తె సోనియాలు విశాఖలో చికిత్స పొందుతున్నారు. రాధ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. అలా గే బండి బాలకృష్ణ, బండి పూర్ణ, పన్నీరు చిరంజీవిలు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బండి సంతు, అమృతలు నరసన్నపేటలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు ఈ ప్రమాదంలో గాయాలు కావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.