
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిశీలన
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో 20 ఏళ్లుగా వరద నీటి సమస్య ఉంద ని జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆయన గురువారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ అవసరం ఉందని తెలిపారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పర్యటనకు వచ్చిన నాగబాబు వెంట జనసేన పార్టీకి సంబంధించిన శ్రీకాకుళం సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు, పాతపట్నం సమన్వయకర్త గేదెల చైతన్య వర్గాల మధ్య పోరు కనిపించింది. ఆర్టీసీ అధికారులతో నాగబాబు మాట్లాడుతుండగా చైతన్య లోపలకు వెళ్లారు. సర్వేశ్వరరావు కూడా వెళ్లేందుకు ప్రయత్నించగా గేదెల చైతన్య వర్గం అడ్డుకుంది. దీంతో కొంతసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద నాయకులు కార్లు ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.