
‘మౌలిక వసతులు కల్పించాకే తరలిస్తాం’
సంతబొమ్మాళి: పోర్టు నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే మూలపేట గ్రామం ఖాళీ చేయించి మిమ్మల్ని తరలిస్తామని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి అన్నారు. గురువారం పోర్టు నిర్వాసితులకు నౌపడలో కేటాయించిన ఆర్‌అండ్ ఆర్ కాలనీలో నిర్వహించిన లాటరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 506 పీడీఎఫ్‌లకు గా ను ప్రతి పీడీఎఫ్‌కు 5 సెంట్లు ఇంటి స్థలం ప్రభు త్వం కేటాయించిందన్నారు. ఆ స్థలం ఎక్కడ, మీ స్థలం ఏదీ అని తెలుసుకోవడానికి మాత్రమే లాటరీ తీస్తున్నామని అన్నారు. లాటరీ ద్వారా తీసిన నంబ ర్ ప్రకారం మీకు ఐదు సెంట్లు స్థలం చూపించడానికి 15 రోజుల సమయం పడుతుందన్నారు. సుడా అనుమతి పొందిన తర్వాతే లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తున్నామని, ఇది మార్చే అధికారం తనకు గానీ తహసీల్దార్‌కు గానీ లేదన్నారు. 586 ప్లాట్‌లను ఆరు బ్లాక్‌లుగా విభజించి ఎర్త్ ఫిల్లింగ్ ఇతర పనులు చేపడుతున్నామని అన్నారు. ఐదుకోట్ల 50 లక్షల రూపాయిలతో మరో రెండు అడుగులు ఎత్తు చేయడానికి ఎర్త్ ఫిల్లింగ్ పనులు చేపడుతున్నామని తెలిపారు. మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుడి నిర్మాణానికి కూడా అన్ని చర్య లు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ హేమసుందరరావు, స్థానిక సర్పంచ్ జీరు బాబురావు, మాజీ సర్పంచ్ జీరు భీమారావు, కోట నారం నాయుడు, జీరు శివ, రోహిణీరావ్, జీరు రాంబాబు తదితరులు ఉన్నారు.