ఖాకీ మార్క్‌ కుట్రలు! | - | Sakshi
Sakshi News home page

ఖాకీ మార్క్‌ కుట్రలు!

Oct 16 2025 6:26 AM | Updated on Oct 16 2025 6:26 AM

ఖాకీ

ఖాకీ మార్క్‌ కుట్రలు!

రెడ్‌బుక్‌ రాజ్యంలో

క్కచిత్రంలో నకిలీ మద్యంకు వ్యతిరేకంగా పలాస–కాశీబుగ్గలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, మహిళలు నిరసన ర్యాలీ చేస్తుండగా దూసుకొస్తున్న మహిళలను రోప్‌తో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త పైల వేణుగోపాల్‌రెడ్డిని పిలిచి, రోప్‌ పట్టుకోమని చెప్పి, ఎలా గట్టిగా పట్టుకోవాలో భుజం తట్టి కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ చెప్పారు. దానికి సంబంధించిన విజువల్స్‌ స్పష్టంగా ఉన్నాయి. పోలీసుల సూచనలు పాటించి, తోపులాట జరగకుండా నివారించిన వేణుగోపాల్‌రెడ్డిని అభినందించాల్సింది పోయి ఆయనపైనే అక్రమ కేసు పెట్టి, నిర్బంధించారు. మహిళా పోలీసు సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించారని కేసు పెట్టి, హైడ్రామాకు తెరలేపారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

లాసలో పోలీసులు హైడ్రామా నడిపారు. మహిళా హోంగార్డులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పైల వేణుగోపాల్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని వాదన తెరపైకి తెచ్చిన పోలీసు అధికారులు నిన్నంతా ఒక మహిళా హోంగార్డుతో ఫిర్యాదు చేయించేందుకు తీవ్రంగా యత్నించారు. కానీ ఆమె ఎంతకీ ఒ ప్పుకోలేదు. రోజంతా ఒత్తిడి చేసినా ఫిర్యాదు చే సేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అదే రోజు డ్యూ టీలో ఉన్న మరో మహిళా కానిస్టేబుల్‌ చేత ఫిర్యా దు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి.

రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో భాగమే..

పలాస నియోజకవర్గంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పథకం ప్రకారం కక్ష సా ధింపు చర్యలు చేపడుతున్నారు. అందుకు పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. పలాస ని యోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై వరుస పెట్టి కేసులు పెడుతున్నారు. ఏదో ఒక ఘటనలో ఇరికించి జైలుకు పంపించాలని చూస్తున్నారు. అందులో భాగంగా కుట్రలు పన్నుతున్నారు. తాజాగా కల్తీ మద్యంకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీ చేపట్టినందుకు న్యూసెన్స్‌ కింద 23 మందిపై కేసు పెట్టారు. ఆ తర్వాత ర్యాలీలో మహిళా పోలీసు సిబ్బందితో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పైల వేణుగోపాల్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో ఇదంతా చేశారని ఆయనపై కేసు పెట్టారు. మంగళవారం రాత్రి వేణుగోపాల్‌రెడ్డిని ఎందుకు అక్రమ అరెస్టు చేశారని డిమాండ్‌ చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చి, బైఠాయించిన వారిపై కూడా కేసులు పెట్టారు. ఈ ఘటనలో 15 మందిపై కేసు పెట్టినట్టు సమాచారం. పలాసలో అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. పచ్చనేతలు పథక రచన చేస్తే.. అధికారులు కుట్రలు అ మలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

నిరసన ర్యాలీ చేస్తే.. హత్యాయత్నం కేసులు

ఈ మొత్తం ఘటన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో జరిగిందని ఆయనతో పాటు మరో 14 మందిపై కేసులు పెట్టారు. 132,74,79, ఆర్‌/డబ్ల్యూ 3(5), 109(1), 49 బీఎన్‌ఎస్‌ సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. దీంట్లో మంగళవారం నిర్బంధంలోకి తీసుకున్న పైల వేణుగోపాల్‌రెడ్డి అనే కార్యకర్తను అరెస్టు చూపించి, బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. మిగతా వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ర్యాలీ జరిగిన రోజు న్యూసెన్స్‌ కింద 23మందిపై కేసు పెట్టారు. పైల వేణుగోపాల్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని పోలీసు స్టేషన్‌లో డిమాండ్‌ చేసినందుకు, బైఠాయించినందుకు 15మందిపైన కేసు పెట్టారు.

ప్రజా వ్యతిరేక చర్య

నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు పెడతారా? ఇదెక్కడి సంప్రదాయం. పోలీసులు వైఖ రి దారుణంగా ఉంది. టీడీపీ నాయకులు చెప్పినట్టు గానడుస్తున్నారు. తప్పుడుకేసులు సరికాదు. పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారు. తప్పుడు ఫిర్యా దులు, తప్పుడు మార్గాలు ఎంచుకుంటే తగిన మూ ల్యం చెల్లించుకుంటారు. –తమ్మినేని సీతారాం,

మాజీ స్పీకర్‌, పార్టీ పార్లమెంట్‌ సమన్వయ కర్త

ఖాకీ మార్క్‌ కుట్రలు!1
1/4

ఖాకీ మార్క్‌ కుట్రలు!

ఖాకీ మార్క్‌ కుట్రలు!2
2/4

ఖాకీ మార్క్‌ కుట్రలు!

ఖాకీ మార్క్‌ కుట్రలు!3
3/4

ఖాకీ మార్క్‌ కుట్రలు!

ఖాకీ మార్క్‌ కుట్రలు!4
4/4

ఖాకీ మార్క్‌ కుట్రలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement