
దివ్వైమెన ప్రతిభ
● ప్రమిదలు తయారు చేస్తున్న విభిన్న ప్రతిభావంతులు
● బెహరా మనోవికాస కేంద్రంలో ప్రదర్శన
శ్రీకాకుళం కల్చరల్: దీపావళి సమీపిస్తోంది. ప్రతి ఇంటా వెలుగులు నింపేందుకు ప్రమిదలు తయారవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బెహరా మనోవికాస కేంద్రంలోని మానసిక దివ్యాంగులు అందమైన దివ్వెలు తయారు చేసి విక్రయిస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలతో ఎవరికీ తీసిపోని విధంగా ఈ ప్రమిదలు తయారు చేస్తున్నారు. పండగ సందర్భంగా వీటిని చక్కటి రంగులు వేసి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు.
ఎగ్జిబిషన్ ఏర్పాటు
మల్టీకలర్‌లో తయారు చేస్తున్న ఈ ప్రమిదలతో హౌసింగ్ బోర్డులో ఉన్న బెహరా మనోవికాస కేంద్రంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రమిదలను 74 మంది మానసిక దివ్యాంగులు కలిసి తీర్చి దిద్దుతున్నారు. తన వంతుగా నిర్వాహకురాలు శ్యామల వారిని ప్రోత్సహిస్తున్నా రు. ఈ సారి మల్టీకలర్స్‌తో తీర్చిదిద్దుతున్నారు. వీటిలో ఒక రకం ధర 12 ప్రమిదలు రూ.60లు, అలాగే మరోరకం 12 ప్రమిదలు రూ.100లు అమ్మకానికి ఉన్నాయి.
ప్రోత్సహించండి
దివ్యాంగులు తయారు చేస్తున్న మల్టీకలర్ ప్రమిదలను కొనుగోలు చేసి అందరూ సహకరించాలి. ఎవరైనా కొనుగోలు చేయాలంటే 9848868960 ను సంప్రదించాలి. – శ్యామల,
నిర్వాహకురాలు, బెహరా మనోవికాస కేంద్రం, శ్రీకాకుళం

దివ్వైమెన ప్రతిభ

దివ్వైమెన ప్రతిభ

దివ్వైమెన ప్రతిభ