‘డిసెంబర్‌ నాటికి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ పూర్తి’ | - | Sakshi
Sakshi News home page

‘డిసెంబర్‌ నాటికి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ పూర్తి’

Oct 16 2025 6:18 AM | Updated on Oct 16 2025 6:18 AM

‘డిసె

‘డిసెంబర్‌ నాటికి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ పూర్తి’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదే శించారు. బుధవారం ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను ఆయన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మ ద్‌ ఖాన్‌తో కలిసి సందర్శించారు. ప్రభుత్వ శాఖలన్నీ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లోనే ఉండాలన్నారు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ అన్ని ఫ్లోర్లలోని గదులను క్షుణ్ణంగా పరిశీలించి జేసీతో చర్చించారు. బయట చిన్న షాప్స్‌ పెట్టుకునే విధంగా స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని ఎస్‌ఈని ఆదేశించారు. వెనుక వైపు పార్క్‌ లేదా ఆడుకునేందుకు వీలుగా చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ పి.సత్యనారాయణ, ఆర్‌ అండ్‌ బి ఈఈ ఎ.తిరుపతిరావు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ, కాంట్రాక్టర్‌ శ్రీరాం పాల్గొన్నారు.

నవంబర్‌ 2న ఆదిత్యుని హంసనావికోత్సవం

అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూ ర్యనారాయణ స్వామి ఆలయ ఇంద్రపుష్కరిణిలో నవంబర్‌ 2న హంస నావికోత్సవం (తెప్పోత్సవం) జరుగుతుందని ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ తెలియజేశారు. కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఇంద్రపుష్కరిణిలో ప్రత్యేకమైన హంస వాహనంపై స్వామి వారి ఉత్సవమూర్తులు విహరించనున్నారని, ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయనున్నామని వివరించారు. ఆల య ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ సూచనల మేరకు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని జరిగేలా అలాగే వేలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా పక్కా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ముఖ్య ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో పుష్కరిణికి తూర్పు భాగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రత్యేక హంసవాహనం తయారీ కోసం టెండర్లు కూడా ఈ నెల 18న పిలుస్తున్నామని తెలిపారు.

కేసులు వేగంగా పరిష్కరించాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా జైళ్లలో ఉన్న ముద్దాయిల కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జునైద్‌ అహ్మద్‌ మౌలానా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మార్గదర్శకాల మేరకు అండర్‌ ట్రయల్‌ రివ్యూ కమిటీ (యూఆర్‌టీసీ) సమావేశం బుధవారం స్థానిక జిల్లా కోర్టులో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా మాట్లాడుతూ.. బెయిల్‌ మంజూరై నా విడుదల కానివారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మహిళా ముద్దాయిల కేసులను యూఆర్‌టీసీలో చర్చించి, వారికి బెయిల్‌పై త్వరితగతిన విడుదల చేయించాలన్నారు. జిల్లాలో క్రైమ్‌ రేటును తగ్గించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూ చించారు.

జేజేఎం లక్ష్యాలు పూర్తి చేయాలి: కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జల జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద చేపట్టిన పనులను, ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 15, 2025 నాటి గణాంకాల ప్రకారం, జిల్లాలో మొత్తం 4,87,307 ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 2,29,649 కనెక్షన్లు పూర్తయ్యాయి. ఇంకా 2,57,658 కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉంది. పనుల పురోగతి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మండలాల వారీగా కార్యాచరణ ప్ర ణాళికను అమలు చేయాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 29 గ్రామాలు ‘హర్‌ ఘర్‌ జల్‌’ డిక్లరేషన్‌ సాధించాయి. డిసెంబర్‌ 2025 నాటికి మరింత మందికి తాగునీరు అందించే లక్ష్యంతో నవంబర్‌ నుంచి మార్చి 2026 వరకు మరో 178 గ్రామాలను డిక్లేర్‌ చేయడానికి లక్ష్యం పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు.

‘డిసెంబర్‌ నాటికి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ పూర్తి’ 1
1/1

‘డిసెంబర్‌ నాటికి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ పూర్తి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement