
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ప్రత్యేక గుర్తింపు
ఎచ్చెర్ల:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశేణి విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే ఐబీఎం క్వాంటమ్ క్యూస్కిట్ పాల్ ఫెస్ట్–2025లో భాగంగా ఆర్‌జీయూకేటీ (ఐఐఐటీ) శ్రీకాకుళంను ఐబీఎం క్వాంటమ్ ప్రత్యేకంగా ఎంపిక చేసింది. మన దేశం నుంచి కేవలం పది వర్సిటీలకు మాత్రమే ఈ అవకాశం రాగా మన రాష్ట్రం నుంచి ఆర్‌జీయూకేటీ మాత్రమే ఉండడం విశేషం. ఆర్‌జీయూకేటీ విద్యార్థులు కాటం నిఖిల్, తేజ, కాశీం వాలీ, దూదేకుల ప్రవీణ్‌కుమార్, చెరుకూరి జాన్‌బాబు, చదువులు గురుశ్రీకిమ్మిడి ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా ఈ ఘనత సాధ్యమైంది. ఈ ఫెస్ట్ అక్టోబర్ 21 నుంచి 27 వరకూ ఆర్‌జీయూకేటీ నాలుగు క్యాంపస్‌లు శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఆర్.కె వ్యాలీలలో జరగనుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు ఆన్‌లైన్‌లో పాల్గొంటారు. ఈ ఫెస్ట్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధి, ఈ రంగంలో ఉన్న అవకాశాలపై అవగాహన పెంపొందించేందుకు వర్క్‌షాప్‌లు, నిపుణుల ఉపన్యాసాలు, హ్యాక్‌థాన్ నిర్వహిస్తారు. వర్సిటీకి ఇది గర్వకారణమని శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ తెలిపారు. ఈ టెక్నికల్ ఫెస్ట్‌కు డీన్ ఎకడమిక్స్ డాక్టర్ ఎం. శివరామకృష్ణ కన్వీనర్‌గా, విద్యార్థుల కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.