
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ
నరసన్నపేట: ౖవెద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాలను సేకరించడానికి ప్రజా ఉద్యమాన్ని నిర్వహి స్తోంది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు ఏయే తేదీల్లో ఏయే కార్యక్రమాలు చేపట్టాలో వివరిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణలు చేపట్టాలని సూచించా రు. అలాగే అక్టోబరు 10 నుంచి నవంబర్ 22 వరకూ రచ్చబండ, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అక్టోబరు 28న అన్ని నియోజవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 23న సేకరించిన సంతకాల పత్రాలు నియోజకవర్గాల నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి చేర్చాలన్నారు. 24న ఈ సంతకాల పత్రాలు జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తామన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా మొత్తం కోటి సంతకాలతో పత్రాలు గవర్నర్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు సురక్షిత నీరు అందించాలి : కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: పిల్లల ఆరోగ్యంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. హాస్టళ్లలో నీటి నాణ్యత పరీక్షించాలని సూచించారు. సమావేశం అనంతరం జీఎస్టీ తగ్గింపుతో ఇంటింటికి లబ్ధి అనే గోడ పత్రికలను, డీఆర్‌డీఏ రూపొందించిన సీ్త్ర నిధి కి సంబంధించిన బ్రోచర్లను కూడా ఆవిష్కరించారు.
జాతీయ స్థాయి గట్కా పోటీలకు సత్యవరం విద్యార్థులు
నరసన్నపేట: సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి గట్కా పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 వ తేదీల్లో చత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్‌లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో రాష్ట్రం తరఫున సత్యవ రం స్కూల్ విద్యార్థులు టెంక జానకీరాం, పాసి పుష్ప, పాసి రాఘవేంద్ర, ఎ.శరత్‌కుమార్, దర్శినిలు ఎంపికయ్యారని హెచ్‌ఎం వకులా రత్నమాళ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను స్కూల్ హెచ్‌ఎం వకులా రత్నమాళ, పీఈఓ జ్యోతి రాణితో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
శ్రీముఖలింగం ఆలయం ఈఓగా ఏడు కొండలు
జలుమూరు: శ్రీముఖలింగం ఆలయ ఈఓగా కె.ఏడుకొండలు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో పనిచేసి పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న వాసుదేవరావు పాతపట్నం నీలమణి అమ్మ వారి దేవస్థానానికి వెళ్లారు.
నేటి నుంచి విద్యాశక్తి
కార్యక్రమాల బహిష్కరణ
శ్రీకాకుళం: ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తప్ప మరే బోధనేతర కార్యక్రమాలు ఉపాధ్యాయులు చేయబోరని జిల్లా ఫ్యాప్టో చైర్మన్, సెక్రటరీలు బమ్మిడి శ్రీరామమూర్తి, పడాల ప్రతాప్ కుమార్‌లు తెలిపారు. రాష్ట్ర ఫ్యాప్టో శాఖ పిలుపు మేరకు జిల్లా ఫ్యాప్టో శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఈఓ ఎ.రవిబాబులకు మెమొరాండం అందజేశారు. కా ర్యక్రమంలో బి.రవి కుమార్, బి.వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం అసోసియేషన్ వి.సత్యనారాయణ, జి.రమణ, ఎస్ రమేష్ బాబు, బి.రవి, సూర్యప్రకాష్ తదితరలు పాల్గొన్నారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ