
సారాపై ఉక్కు పాదం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో నాటుసారా తయారీ విక్రయాన్ని పూర్తిగా అరికట్టడానికి ‘నవో దయం 2.0‘ కార్యక్రమం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని, సారా రహిత జిల్లా లక్ష్యం సాధించే వరకు దాడులు, నిఘా కొనసాగుతాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎకై ్సజ్, పోలీస్, రెవె న్యూ, అటవీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఫిబ్రవరి నుంచి తీసుకున్న చర్యల వివరాలను కలెక్టర్‌కు సమర్పించారు. ఇప్పటివరకు 179 ఐడీ లిక్కర్ కేసులు నమో దు చేయగా, 221 మందిని అరెస్టు చేశామని, 3477.8 లీటర్ల ఐడీ మద్యం స్వాధీనం చేసుకోగా, 27,790 లీటర్ల జేఎఫ్ (ఎఫ్‌జె) వాష్‌ను ధ్వంసం చేశామని వివరించారు. 75 కిలోల బెల్లం, 17 వాహ నాలను అధికారులు సీజ్ చేశామన్నారు. బెల్లం సరఫరాదారులపైనా దృష్టి సారించి, ఆరుగురు వ్యాపారులను కూడా అరెస్టు చేసినట్టు వెల్లడించారు. సా రా గురించి సమాచారం తెలిస్తే 14405 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, జిల్లా ఎకై ్సజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ తిరుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు.