
‘కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే థర్మల్ ప్లాంట్’
బూర్జ: బడా కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టేందుకే థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించ తలపెడుతున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. గురువారం మండలంలో గల అన్నంపేట పంచాయతీ మసానపుట్టి గ్రా మంలో ఆదివాసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల జీవితాలతో పాటు పర్యావరణాన్ని నాశనం చేసే క్రిటికల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈప్రాంతంలో నిర్మాణం చేపట్టవద్దని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ, మాజీ మంత్రి వర్యులు వడ్డే శోభనా ద్రీశ్వరరావు మాట్లాడుతూ పచ్చని ప్రకృతిని, సంప్రదాయాలను కాపాడాల్సిన పాలకులు ఆదివాసీలు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారని మండి పడ్డా రు. 32 వేల మెగా వాట్స్ సామర్థ్యంతో ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మిస్తే ఆదివాసీలతో పాటు రైతులు జీవిస్తున్న ఈ ప్రాంతమంతా శ్మశానంగా మారుతుందన్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదన తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సలహాదారుడు మహదేవ్, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, నూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ రాష్ట్ర నాయకులు మరనాథ్, అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.వర్మ పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవర సింహాచలం, కోశాధికారి రవికాంత్, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, కుసుమ, ప్రజాసంఘాల నాయకులు, కె.మోహనరావు, ఆదివాసీలు, దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.