జీడి పరిశ్రమల్లో మగ్గుతున్న మహిళలు
కానరాని కనీస సౌకర్యాలు
పట్టించుకోని అధికారులు
చర్యలు తీసుకుంటాం..
కానరాని భద్రతా చర్యలు..
రంగు మారిన
కార్మికురాలి
చేతులు
మేం మత్స్యకారులమైనా చేపలు అమ్మకాలు చేయలేం. ఊరిలోనే ఉపాధి దొరకటంతో జీడి పరిశ్రమలో చేరాం. రోజుకు 20 కేజీల వరకు జీడి తొక్క తీస్తాం. కేజీ పిక్క తీయడానికి రూ. 28 ఇస్తున్నారు. చేతికి రక్షణ కోసం మేమే గ్లౌజ్‌లు కొనుక్కున్నాం.
– మువ్వల తొపే, జీడి కార్మికురాలు, నువ్వలరేవు
వజ్రపుకొత్తూరు రూరల్:
ఉద్దాన ప్రాంతంలో లక్షలాది మంది రైతులు జీడి పంటను సాగు చేస్తూ జీవనోపాధి సాగిస్తుంటే.. పరోక్షంగా వేలాది మంది కార్మికులు జీడి పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇదంతా అంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వేలాది మంది మహిళలు ఉపాధి మార్గాలు లేక తమ సంప్రదాయ వృత్తులను వీడి జీడి కార్మికులుగా మారుతున్నారు. పిక్కలను కట్ చేసేటప్పుడు, పిక్క నుంచి జీడి గుడ్డును వేరు చేసేటప్పుడు హానికరమైన జీడి చేతు లకు తగిలి ఎంతోమంది మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు.
పల్లెలకు పాకిన జీడి పరిశ్రమలు:
ఒకప్పుడు కాశీబుగ్గ, పలాస పట్టణాలకు పరిమత మై జీడి పరిశ్రమలు నేడు పల్లెలకు పాకుతున్నాయి. కాశీబుగ్గ ఇండస్ట్రీయల్ ఏరియాతో పాటు పలాస, టెక్కలిపట్నం రోడ్డు, గరుడబద్ర, అక్కుపల్లి, పాతటెక్కలి, అమలపాడు పరిసర ప్రాంతాల్లో దాదాపు గా 150 పరిశ్రమలు ఉన్నాయి. తాజాగా, నువ్వలరేవు, డోకులపాడు, చినడోకులపాడు, కొండవూరు, చినవంక,మందస మండలంలో గల మారు మూల ప్రాంతాలలో అదనంగా సుమారు 200 జీడి పరిశ్రమలను నెలకొల్పారు.
కష్టానికి ఏదీ ప్రతిఫలం..
కొందరు జీడి పరిశ్రమ యజమానులు, వ్యాపారు లు తమ లాభార్జన చూసుకుంటున్నారే తప్పా పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం, భద్రత పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నా యి. నువ్వలరేవులో వందలాది మంది మత్స్యకార మహిళలు సంప్రదాయ చేపల వృత్తిని వదిలి జీడి కార్మికులుగా మారారు. రోజుకు 10 –15 కిలోల జీ డి పిక్కలు వలుస్తుంటారు. కేజీ పిక్కలను రూ. 24 మాత్రమే ఇస్తుండటంలో కూలీ సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక అధికారులు స్పందించి తమకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
జీడి పరిశ్రమలలో కార్మిక చట్టాలను అతిక్రమిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలిస్తున్నాం. ప్రతి కార్మికుడు ఈ–శ్రామిక్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
– పి.విజయ్‌కుమార్, కార్మిక శాఖాధికారి, పలాస
కార్మికులు పని చేసే చోట మరుగుదొడ్లు వంటి కనీ స వసతులు లేకపోవడంతో మహిళా కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. చేతులకు గాయాలు కాకుండా కనీసం రక్షణ సామగ్రి సమకూర్చడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. కార్మికులు అనారోగ్యానికి గురైనా యజమానులు నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని పలువురు వాపోతున్నారు. చేతికి రక్షణ లేకుండా పని చేయడం వల్ల వేలి ముద్రలు అరిగిపోవడంతో ప్రభుత్వ పథకాల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మసిబారుతున్న బతుకులు
మసిబారుతున్న బతుకులు