● ప్రత్యేక అలంకరణకు ప్రాధాన్యమిస్తున్న జనం
● వేడుకను బట్టి అలంకరణ సామగ్రి
అలంకరణలకు
ప్రాధాన్యత పెరిగింది
మార్కెట్‌లో అలంకరణ వస్తువులకు గిరాకీ పెరిగింది. దేవుడి పూజలకు కూడా అలంకరణ వస్తువులు కొంటున్నారు.
– దాస్యం రాంబాబు,
అలంకరణ సామగ్రి షాపు యజమాని
ఫంక్షన్లకు పిలుస్తారు..
పుట్టిన రోజులు, పూజలు తదితర ఫంక్షన్లకు నన్ను పిలుస్తారు. కొన్ని బెలూన్లతో, మరికొన్ని అలంకరణ వస్తువులతో డెకరేషన్ చేస్తుంటాను. ఇటీవల వినాయక చవితికి వైకుంఠద్వారం తయారు చేశాను. – దాకోజు లాల్ ప్రసాద్,
డెకరేటర్, కంపోస్టు కాలనీ
భారీస్థాయిలో కూడా చేస్తాం
మేము భారీ స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు ఎవరికి ఏ విధంగా కావాలో వాటిని తయారు చేస్తాం. అవుట్ డోర్, ఇండోర్‌లో కూడా డెకరేషన్ చేస్తాం.
– గోపి, ఎంజీఆర్ క్లాత్ డెకరేటర్, శ్రీకాకుళం
శ్రీకాకుళం కల్చరల్: వేడుక ఏదైనా జిల్లా వాసులు వేదికలను మాత్రం అదరగొడుతున్నారు. సాదా సీదా అలంకరణలకు టాటా చెప్పేసిన జిల్లా వాసులు ప్రత్యేక థీమ్‌లతో పండుగలు, ఉత్సవాలకు కొత్త సొబగులు అద్దుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ అలంకరణల అలవాటు బాగా పెరిగింది. వీరి అభిరుచికి తగ్గట్టు మార్కెట్‌లోనూ కొత్త దుకాణాలు వెలిశాయి.
మార్కెట్లో పెరిగిన డిమాండ్
జిల్లా కేంద్రంలోని పెట్రోమాక్సు వీధిలో ఒకే చోట సుమారుగా 10 షాపులు ఉన్నాయి. వీటిలో అన్ని శుభకార్యాలకి సంబంధించిన వస్తువులను షాపుల్లో అమ్ముతున్నారు. వినియోగదారులు వీటిని కొనుగోలు చేసి తమ ఇళ్లన్లు తామే అలంకరించుకుంటున్నారు. తాము చేసిన డెకరేషన్‌ను ఫేస్‌బుక్‌లలో, ఇన్‌స్ట్రాగ్రామ్ తదితరమై వాటిలో పెడుతూ వైరల్ చేస్తున్నారు.
స్థాయిని బట్టి ఖర్చు
సందర్భానికి తగ్గట్టుగా అలంకరణలను ప్లాన్ చేస్తున్నారు. గోడ సైజును బట్టి పెట్టేందుకు కర్టెన్లు, ఆకులు, పుష్పాల పెయింటింగ్‌లతో అమ్ముతున్నారు. పేద, మధ్య తరగతి వారు కూడా ప్రతి చిన్న కార్యక్రమానికి అలంకరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రతి కార్యక్రమాన్ని పండగలా జరుపుకుంటున్నారు. పెద్ద పెద్ద పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, షష్టిపూర్తి, బారసాల, పెద్దపూజలు వంటి సయంలో డెకరేటర్లను పిలిపించుకుని మరీ అలంకరణలు చేయించుకుంటున్నారు.
వేడుకేదైనా.. వేదిక వెలిగిపోవాల్సిందే..!
వేడుకేదైనా.. వేదిక వెలిగిపోవాల్సిందే..!
వేడుకేదైనా.. వేదిక వెలిగిపోవాల్సిందే..!