
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
గార: సతివాడ పంచాయతీ మాజీ సర్పంచ్ గంగు ప్రభాకరరావు (రమణ)() బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుభకార్యం నిమిత్తం గార వైపు వెళ్తుండగా నిజామాబాద్ –తూలుగు జంక్షన్ మధ్య బైక్ అదుపు తప్పడంతో కింద పడిపోయారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభాకరరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మాజీ సర్పంచ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
13 నుంచి ఎఫ్‌ఏ –2 పరీక్షలు
నరసన్నపేట: పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకొనేందుకు ఎఫ్‌ఏ–2 పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్‌లో విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రశ్న పత్రాలు ఆయా మండలాల ఎంఆర్‌సీలకు వచ్చాయి. ఒకటి నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థులు 13న ఉదయం తెలుగు(మొదటి లాంగ్వేజ్), సాయంత్రం గణితం, 14న ఉదయం ఇంగ్లీషు, సాయంత్రం ఎన్విరాల్‌మెంటల్ సైన్స్, 15న ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాయనున్నారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 13న ఉదయం తెలుగు, సాయంత్రం గణితం, 14న ఉదయం హిందీ, సాయంత్రం జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ రాయాల్సి ఉంటుంది. 15న ఉదయం ఇంగ్లీషు, సాయంత్రం సోషల్, 16న బయోలాజికల్ సైన్స్, సాయంత్రం ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నరసన్నపేట ఎంఈఓ శాంతారావు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి