
చీటింగ్ కేసులో ఇద్దరు అరెస్టు
పాతపట్నం: చీటింగ్ కేసులో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఎస్‌ఐ కె.మధుసూదనరావు బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మండలం చిన్నపద్మాపురం గ్రామానికి చెందిన బి.వెంకట్రావు, సారవకోట మండలం గోవర్ధనపురం గ్రామానికి చెందిన జి.రమేష్‌లు పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో శేషారావు పేరిట భూమికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలను సృష్టించారు. ఆ భూమిని పాతపట్నం శాంతినగర్‌కు చెందిన సీహెచ్ శ్రీనివాసరావుకు అమ్మచూపి, రూ.13.50 లక్షలు తీసుకుని మోసం చేశారు. తిరిగి డబ్బులు అడిగితే టెక్కలి మండలం లింగాలవలసకు చెందిన వై.గోపితో పాటు మరికొందరితో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు సీహెచ్ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకట్రావు, రమేష్‌లపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.