దుర్గమ్మా..చల్లగా చూడమ్మా.. | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మా..చల్లగా చూడమ్మా..

Oct 5 2025 12:12 PM | Updated on Oct 5 2025 12:12 PM

దుర్గ

దుర్గమ్మా..చల్లగా చూడమ్మా..

అమలపాడులో ఘటాల ఉత్సవం

మలపాడు గ్రామం భక్త జనసంద్రమైంది. దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన దుర్గమ్మతల్లి ఘటాల ఉత్సవానికి అశేష జనవాహిన తరలి రావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పాహిమాం దేవీ.. పాహిమాం.. అంటూ భక్తుల శరణు ఘోషతో సాగిన ఘటాల ఊరేగింపులో మేళతాళాలు, పగటి వేషాలు, కాళీమాత వేషధారణలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీ దుర్గాదేవీ లేబర్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలోల 108 మంది మహిళలు ఎరుపు వస్త్రధారణలో ఊరేగింపుగా దుర్గామాత పూజా మందిరానికి చేరుకున్నారు. అక్కడ నుంచి అసిరిపోలమ్మ తల్లి అమ్మవారి ముర్రాటలు, వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మండల పార్టీ ఉపాధ్యక్షుడు స్థానిక సర్పంచ్‌ దున్న రత్నం బాలరాజు, కారాడ గిరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు దున్న లోకనాధం, దుర్గా దేవి లేబర్‌ కమిటీ నాయకులు ఇరోతు అప్పన్న, దున్న రాజులు, వి.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. – వజ్రపుకొత్తూరు

దుర్గమ్మా..చల్లగా చూడమ్మా.. 1
1/1

దుర్గమ్మా..చల్లగా చూడమ్మా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement