
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఏమైందో ఏమో..?
ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో
పాలిటెక్నిక్ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణాలు తెలియాల్సి ఉంది.
–8లో
‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అని ఓ సినీ కవి అన్నట్లు స్నేహబంధం ఎప్పటికీ మనతోనే ఉంటూ మన జీవితంలో భాగమవుతుంది. పుట్టినప్పుడు మనతోపాటు ఎన్నో బంధాలు, రక్త సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత మన నడవడిక, వ్యక్తిత్వం ఆధారంగా స్నేహం మన జీవితంలోకి వస్తుంది. ఆపదలో ఆదుకుంటూ.. కష్టాల్లో పక్కనుంటూ.. ఎదుగుదలలో తోడుంటూ.. ఇలా రక్త సంబంధం చేయలేనిది కూడా స్నేహ హస్తం చేస్తుంది. మనం విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవారు..విషాదంలో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్లు నలుగురు లేని జీవితాన్ని ఎవరూ ఊహించలేరు. పని ఒత్తిడిలో సతమతమైనా, కుటుంబ బాధ్యతలతో భవిష్యత్తుపై భయం వేసినా ఉపశమనం కలిగించేది ఆత్మీయ మిత్రుల సందేశాలే. నేడు స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...!
– ఇచ్ఛాపురం రూరల్/అరసవల్లి/శ్రీకాకుళం కల్చరల్
నేస్తమా..
నువ్వే
నా ధైర్యం
మహిళల భద్రతే ముఖ్యం
శ్రీకాకుళం క్రైమ్ : మహిళల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని.. సీ్త్రలు, బాలికలపై జరిగే నేరాలు, చట్టాలు, శిక్షలపై ప్రజలకు నిత్యం పోలీసులు అవగాహన కల్పిస్తున్నారని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శనివారం తెలిపారు. సైబర్ మోసాలు, గంజాయి, మద్యం వల్ల కలిగే అనర్థాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలను క్షేత్రస్థాయిలో వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపద సమయంలో డయల్ 112, శక్తియాప్, చైల్డ్‌లైన్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ 181, సైబర్ టోల్‌ఫ్రీ 1930 నంబర్లు ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. గంజాయి క్రయ విక్రయాలు, రవాణా సమాచారా న్ని ఈగల్ 1972 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని యువతకు హితవు పలికారు.
ఖాదీ విశిష్టతను
యువత గుర్తించాలి
పొందూరు: ఖాదీ వస్త్రాల విశిష్టతను యువత గుర్తించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పొందూరు ఏఎఫ్‌కేకే సంఘం, సాయిబాబా వీవర్స్ సొసైటీలను శనివారం సతీమణితో కలిసి కలెక్టర్ సందర్శించారు. యువతను ఆకట్టుకునేలా ఆధునిక డిజైన్‌లతో ఖాదీ వస్త్రాల రూపకల్పన చేయాలని నేత కార్మికులకు సూచించారు. పత్తి నుంచి వస్త్రం తయారయ్యే పద్ధతిని సిబ్బంది వివరించారు. అనంతరం ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశా రు. ఆయనతో పాటు ఏఎఫ్‌కేకే సంఘం అధ్యక్షుడు కామేశ్వరప్రసాద్, సెక్రటరీ దండా వెంకటరమణ తదితరులు ఉన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎచ్చెర్ల : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం లావేరు మండలం తాళ్లవలస రైస్ గొడౌన్ వద్ద అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు ఏడాదిలో మూడు విడతలగా రూ.20 వేలు అందించనున్నామని చెప్పారు. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు కలిపి మొత్తం రూ.7 వేలు జమ చేసినట్లు వివరించారు. జిల్లాలో 2.7 లక్షల మందికి రూ.182 కోట్లు ఇవ్వనున్నామని తెలిపారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో 48,103 మంది రైతులకు రూ.32 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పథకానికి ఇంకా దరఖాస్తు చేసుకోని రైతులు సచివాలయంలో సంప్రదించాలన్నారు. రుణాలను కొత్తగా తీసుకుంటే రూ.160 చెల్లించి బీమా పొందాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీవో ప్రత్యూష, టీడీపీ నాయకులు చౌద రి నారాయణమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వీరి పేర్లు
పి.ఢిల్లేశ్వరరావు (ఢిల్లీ),
ఎం.శంకర్. కాళ్లు చేతులు పనిచెయ్యని, నడవలేని ఢిల్లీ లాంటి పూర్తి దివ్యాంగునితో 35 ఏళ్ల నుంచి స్నేహాన్ని కొనసాగిస్తున్న శంకర్ నిజంగా అభినందనీయుడే. జిల్లా కేంద్రంలోని కుమ్మరివీధి వద్ద ఉంటున్న ఢిల్లీ, మహాలక్ష్మినగర్‌లో ఉంటున్న శంకర్‌ల మధ్య స్నేహం చెక్కు చెదరనిది. అరసవల్లి మిల్లు కూడలి వద్ద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు ఇద్దరూ కలిసి చదువు కున్న రోజుల నుంచే పుట్టిన స్నేహం నేటికీ కొనసాగుతోంది. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఢిల్లీకి ఇంట్లో తన వాళ్లు అన్నీ చూసుకుంటుంటే...బయట ప్రపంచాన్ని మాత్రం శంకరే చూపించాడు. సినిమాలకు సైతం ఢిల్లీని శంకరే వెంటేసు కుని థియేటర్లకు తీసుకెళ్తుంటాడు. ఢిల్లీతోనే తన టిఫిన్ దుకాణాన్ని ప్రారంభించి.. రోజూ తొలి టిఫిన్ ఢిల్లీకి ఇచ్చి..తర్వాతే మిగిలిన వారికి అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతున్న శంకర్‌కు నిజంగా హ్యాట్సాఫ్.
●ఆపదలో ఉన్నవారిని
ఆదుకుంటున్న స్నేహితులు
●మేమున్నామంటున్న
ప్రవాసాంధ్రులు
●వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపు
సభ్యులుగా మరికొందరి సేవలు
●నేడు స్నేహితుల దినోత్సవం
2018 డీఎస్సీలో ఎంపికై న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన 160 మంది తెలుగు భాషాపండితులు ఆత్మీయ స్నేహితులుగా మారి 2019లో ‘తెలుగు సేవా సదన్’ సంఘాన్ని స్థాపించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాల్యాద్రి, పెద లక్ష్మయ్య అధ్యక్షతన 2023 ఆగస్ట్ 15 నుంచి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. వీరంతా వాట్సాప్ సమూహంతో ఆయా జిల్లాల్లో పేదరికంతో, అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు, కిడ్నీ బాధితులకు అండగా ఉంటూ వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమందికి సాయం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపి తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
శ్రీకాకుళం ఎల్‌బీఎస్ కాలనీలో పార్కులో ఉచితంగా యోగా తరగతులు నిర్వహిస్తూ శారద, భారతి, పద్మశ్రీ, లిఖిత, స్వాతి, వనజ, తదితర 30మంది స్నేహితులయ్యారు. యోగాతో పాటుగా ఎన్నో సమాజ హిత కార్యక్రమాలు చేస్తుంటారు. భర్తలు చనిపోయిన భార్యలను ఆర్థికంగా ఆదుకోవడం, ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మొక్కలు పెంచమని ర్యాలీ నిర్వహించడం, ప్లాస్టిక్ వాడకంపైన అవగాహనా ర్యాలీలు, బెహరా మనోవికాస కేంద్రంలోని చిన్నారులకు ప్రతినెలా వారికి తోచిన సాయం చేయడం, వారి పుట్టిన రోజులు జరుపుకోవడం వంటివి చేస్తుంటారు.
ఆ గ్రామంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నామంటూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ఇచ్ఛాపురం మండలం కేదారిపురం గ్రామానికి చెందిన ‘కేపీఎం గల్ఫ్ ఫౌండేషన్ గ్రూప్’. ఇందులో సభ్యులైన 80 మంది స్నేహితులు గల్ఫ్‌లో వలస కూలీలుగా పని చేస్తున్నారు. కేదారిపురం పంచాయతీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ సంఘ సభ్యులు ముందుకు వచ్చి రూ.50వేలు వరకు సాయం అందిస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
●మేమున్నామని..
శ్రీకాకుళం మున్సిపల్ పాఠశాలలో 1965–66 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు నేటికీ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ పేదలకు బియ్యం, ఇతర ఆహార సామగ్రి అందించి అనేక కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఏటా శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య నిర్వహించే నాటిక పోటీలకు ఆర్థికంగా తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చదివిన పాఠశాల అభివృద్ధికి రూ.1,33,967 అందజేశారు. బాపయ్య పంతులు, ఎల్.రామలింగస్వామి, జి.హయగ్రీవరావు తదితర మిత్రులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఉన్న ఊరును, కన్నవారిని విడిచి ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని దేశం కాని దేశం వచ్చి కష్టాలు పాలైతే.. ఆదుకునేందుకు ముందుకు రాని ఈ రోజుల్లో తెలుగు వారంతా ఆప్త మిత్రులుగా మారి తోటివారికి ఆపన్న హస్తం అందించేందుకు పూనుకున్నారు పలువురు ప్రవాసాంధ్రులు. ఉపాధి పనులు కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి పోలెండ్ వెళ్లిన తెలుగు వారు స్నేహితులుగా మారి 2023లో పోలెండ్ శ్రీకాకుళం తెలుగు సంఘంగా ఏర్పడ్డారు. 250 మంది తెలుగు వారు ఏర్పాటు చేసిన ఈ సంఘంలో సభ్యుల సంఖ్య ప్రస్తుతం 360 మందికి చేరుకుంది. విదేశాలకు వెళ్లి మృతి చెందిన వ్యక్తి కుటుంబాలకు, అనారోగ్యంతో విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న కూలీల గురించి వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని అండగా నిలబడుతున్నారు.
పీడీ–పీఈటీ సంఘ కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా పీడీ–పీఈటీల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగింది. అధ్యక్షుడిగా పట్ట తవిటయ్య, ప్రధాన కార్యదర్శిగా మొజ్జాడ వెంకటరమణ, కోశాధికారిగా కె.మాధవరావు, సహాధ్యక్షుడిగా బి.సురేష్, కార్యనిర్వాహక సెక్రటరీగా రెడ్డి రవి, జిల్లా హెడ్‌క్వార్టర్స్ సెక్రటరీగా ఆర్.సతీష్‌రాయుడు, ఇతర కార్యవర్గ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ముఖ్య సలహాదారు పి.సుందరరావు మాస్టారు ప్రమాణస్వీకారం చేశారు.
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ‘సుఖీభవకు కోత.. అన్నదాతకు వాత’ అనేలా సీఎం చంద్రబాబునాయుడు అన్నదాతలను మోసం చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు అన్నారు. ఏడాది పాటు అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా రూ.10,716 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టారని మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నిస్సిగ్గుగా రైతులకు వచ్చి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తల్లికి వందనంలో తల్లులు, పిల్లలను మోసం చేసినట్లే అన్నదాత సుఖీభవలో కూడా రైతులకు దగా చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం కూడా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది కూడా రూ.15 వేలకు బదులు రూ.13 వేలు ఇస్తామని చెప్పి అది కూడా పూర్తిగా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేవలం రూ.8 వేలు, రూ.7 వేలు చొప్పున మాత్రమే జమ చేశారన్నారు. దాదాపు 30 లక్షల మందికి పథకంలో కోత పెట్టడం అన్యాయమన్నారు.
●ఎరువుల కోసం క్యూలైన్లలో పడిగాపులు పడుతున్నారని సీదిరి పేర్కొన్నారు. ధాన్యం సేకరణ తర్వాత 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో పైకం జమ చేస్తామని డప్పు కొట్టిన ప్రభుత్వ పెద్దల మాట నీటిమూటగా మిగిలిందన్నారు. రెండు నెలలు దాటినా డబ్బులు జమ కాక రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ●రొయ్యల ధరలు పతనమైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదని సీదిరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్పార్ సీపీ ప్రభుత్వంలో రూ.280 దాకా పలికితే ఇప్పుడు రూ.200, రూ.220 కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందన్నారు. మిర్చికి మద్దతు ధర కల్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వంచించిందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో క్వింటా మిర్చి ధర రూ.27 వేలు ఇచ్చామన్నారు. నేడు క్వింటా రూ.8 వేలు, రూ.10 వేలు కూడా పలకడం లేదన్నారు.
●విత్తనం నుంచి పంటల అమ్మకం వరకు రైతులకు తోడుగా నిలుస్తూ రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేశామని సీదిరి గుర్తు చేశారు. ఉచిత పంటల బీమా అమలు చేయాలని, ఇన్‌పుట్ సబ్సిడీని తమ హయాంలో మాదిరిగా సీజన్ ముగిసేలోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కేంద్రాలను పునరుద్ధరించాలని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కోసం రైతులు అగచాట్లు పడే దుస్థితి లేకుండా చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
●వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలుకు ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు ఖర్చుచేశామని, ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశామని, సున్నా వడ్డీ పంట రుణాలు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోపే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు జరిగేదని గుర్తు చేశారు. ఇలా అనేక రకాలుగా రైతును చేయిపట్టి నడిపించేలా పాలన సాగిందన్నారు. ఐదేళ్లలో మొత్తంగా రూ.1,84,567 కోట్లు వెచ్చించామన్నారు. ఇప్పుడా వ్యవస్థలన్నీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం విధ్వంసం చేసి వ్యవసాయం దండుగ అనే దాన్ని నిరూపిస్తున్నారని ధ్వజమెత్తారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
భాస్కర్‌కుమార్, సూపరింటెండెంట్
న్యూస్‌రీల్
జిల్లా ఇన్‌చార్జి మంత్రి
కొండపల్లి శ్రీనివాసరావు
అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం