
‘వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్’ స్టాల్ ప్రారంభం
ఆమదావలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘ ఉత్పత్తుల విక్రయ స్టాల్‌ను సెర్ప్ గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ కిరణ్‌కుమార్, స్టేషన్‌మాస్టర్ ఎస్.ఉమామహేశ్వరరావు శనివారం ప్రారంభించారు. తాళ్లవలసకు చెందిన భరతమాత స్వయం సహాయక సంఘ సభ్యురాలు గండ్రెడ్డి కామేశ్వరి ఈ స్టాల్ నిర్వహిస్తారు. తినుబండారాలతో పాటు స్థానికంగా తయారైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కార్యక్రమంలో డీపీఎం బి.నారాయణరావు, ఏపీఎం జి.నారాయణరావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు టి.ధనలక్ష్మి, సీసీలు, వీవోఏలు, అకౌంటెంట్లు పాల్గొన్నారు.