
సిక్కోలులో సౌత్ ఇండియా సొబగులు
● సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించిన సినీ నటి నిధి అగర్వాల్
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని జి.టి.రోడ్డులో సూర్యమహల్ ఎదురుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూం సరికొత్త సొబగులతో శనివారం ప్రారంభమైంది. సినీ నటి నిధి అగర్వాల్ (హరిహరవీరమల్లు ఫేమ్) ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం నాలుగు ఫ్లోర్లలో వైవిధ్యమైన నూతన వస్త్రాలను తిలకించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పవిత్ర శ్రావణమాసంలో తెలుగువారి ముంగిళ్లలో జరిగే వరలక్ష్మి పూజలు, వివాహాది కుటుంబ వేడుకలను, వస్త్ర ప్రియుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసే సరికొత్త మోడల్స్ షోరూంలో అందుబాటులో ఉన్నాయన్నారు. శ్రీకాకుళం ప్రాంతం తనకు ఎంతగానో నచ్చిందని, ఇటీవల విడుదలైన హరిహరవీరమల్లు సినిమాలో తన నటనను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రాజాసాహెబ్ చిత్రం విడుదలవుతుందని చెప్పారు. అనంతరం షాపింగ్‌మాల్ ఆవరణలో ఏర్పాటుచేసిన డయ్యర్స్‌పై ప్రేక్షకులకు అభివాదం చేస్తూ నృత్యం చేశారు.
●సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థల డైరెక్టర్లు శ్రీ సురేష్ శీర్ణ, అభినయ్, రాకేష్, కేశవ్‌లు మాట్లాడుతూ షాపింగ్‌మాల్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడం ఆనందంగా ఉందన్నారు. వివాహాది శుభకార్యాలకు భారతీయ సంప్రదా య కలెక్షన్లకు తమ షోరూం ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు.