బంగారం దుకాణంలో గొలుసుల చోరీ
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో ఉన్న తాళాసు నాన్నారావు బంగారు దుకా ణంలో బుధవారం దొంగతనం జరిగింది. కాశీబుగ్గ పోలీసులు గురువారం విడుదల చేసిన సీసీ పుటేజీ ఆధారంగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి తాళాసు నాన్నారావు బంగారు దుకాణంలోకి టోపీ, మాస్కు పెట్టుకుని వచ్చాడు. బంగారం గొలుసు కావాలని అడగ్గా మూడు గొలుసులు అతడికి చూపించారు. అవి చూస్తున్నట్టుగా నటించి రెండు చైన్లను పట్టుకు ని ఒక్కసారిగా పరిగెత్తాడు. షాపు నుంచి బయటకు వచ్చి షర్టు తీసేసి టీ షర్టుతో పరుగులు పెట్టినట్టు ఫుటేజీలో ఉంది. కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఎస్‌ఐ నర్సింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


