కొత్తూరులో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

కొత్తూరులో భారీ వర్షం

Sep 18 2023 12:32 AM | Updated on Sep 18 2023 12:32 AM

కళాకారులను సత్కరిస్తున్న మంత్రి ధర్మాన 
 - Sakshi

కళాకారులను సత్కరిస్తున్న మంత్రి ధర్మాన

కొత్తూరు: కొత్తూరు మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వినాయక చవితి కావడంతో మార్కెట్‌లో పండ్ల దుకాణదారులతో పాటు వినాయక విగ్రహాలు విక్రయిస్తున్న వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వినాయక మండపాల ఏర్పాటుకు కూడా వాన విఘాతం కలిగించింది.

ముగ్గురిపై కేసు నమోదు

టెక్కలి రూరల్‌: పట్టలసరియా గ్రామంలో గణేష్‌ మండపం ఏర్పాటు విషయంలో తలెత్తిన గొడవలో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ గ్రామంలో ఏటా వినాయకుడి మండపం ఏర్పాటు చేసే స్థలంలో గండేటి భీమారావు తెలుగుదేశం పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. అయితే గ్రామానికి చెందిన కొంత మంది యువకులు మండపం పనులకు అడ్డంగా ఉందనే ఉద్దేశంతో ఆ జెండాను పక్కకు మార్చారు. అది గుర్తించిన భీమారావు, అతని కుమారుడు, భార్య ఒక్కసారిగా యువకులపై దాడిచేశారు. దీంతో గాయాలకు గురైన సార అప్పయ్యతో పాటు మరికొంత మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

జిల్లా ఖోఖో సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఖోఖో అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికై ంది. జిల్లా చైర్మన్‌గా పొన్నాడ రవికుమార్‌ ఎన్నికకాగా, జిల్లా అధ్యక్షునిగా వరుసగా మరోసారి చిట్టి నాగభూషణంను ఏగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని బలగ హాస్పటల్‌ జంక్షన్‌ సమీపంలో ఉన్న భరాతి ఐటీసీ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నా రు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌ ప్రతినిధులు, అధికారులు పరిశీకులుగా, ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.

నూతన కార్యవర్గం

జిల్లా ఖోఖో అసోసియేషన్‌ చైర్మన్‌గా పొన్నాడ రవికుమార్‌, చీఫ్‌ ప్యాట్రన్‌గా బాన్న పవన్‌కుమార్‌, జిల్లా అధ్యక్షునిగా చిట్టి నాగభూషణం, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్‌ ఫల్గుణరావు, కోశాధికారిగా బాడాన నారాయణరావు, ఉపాధ్యాక్షులగా బి.తిరుమలరావు, జీఎం జ్యోతిరాణి పి.రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులగా ఎం.నీలాద్రిరావు, టి.మురళీమోహనరావు, ఆర్‌వీ రత్నం, కార్యవర్గ సభ్యులుగా కె.తిరుపతిరావు, ఎన్‌.పార్వతి, డి.కిషన్‌కుమార్‌, జె.ప్రదీప్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

‘పాత గీతాలు మధురమైనవి’

శ్రీకాకుళం కల్చరల్‌: పాత పాటలు ఆపాతమధురాలని, అవి చిరస్థాయిగా నిలిచి ఉంటాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో విశాఖకు చెందిన నారీభేరీ సంస్థ సుకుమార్‌ ఆర్కెస్ట్రా సంయుక్త నిర్వహణలో ఘంటసాల, ఎస్పీ బాలు సినీ సంగీత విభావరి ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నిర్వాహకులు ఎంతో విశేషమైన ప్రతిభ కలిగిన వారు కావడంతో చక్కనైన గీతాలను వీనుల విందుగా ఆలపించారన్నారు. అనంతరం మంత్రి ధర్మాన కళాకారులను సంస్థ తరఫున సత్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, కళాప్రవీణ బండారు చిట్టిబాబు, డాక్టర్‌ నిక్కు అప్పన్న, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతి, నారీ భేరీ ప్రతినిధులు కింతలి భాగ్యలక్ష్మి, సీవీ రాజేశ్వరి, శైలజ మొరాజ్‌, కొంక్యాణ గోవింద రాజులు చారిటబుల్‌ ట్రస్టు ప్రతినిధులు కొంక్యాన వేణుగోపాల్‌, మండవిల్లి రవి, తదితరులు పాల్గొన్నారు. మధురమైన గీతాలను కెఎల్‌ఎన్‌ మూర్తి, రాజమోహన్‌, హేమచంధర్‌, శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మీ, కూర్మారావు, శైలజ, నాగభూషన్‌, పండరికుమార్‌ తదితరులు వీనుల విందుగా పాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement