మాట్లాడుతున్న శ్రీకాకుళం డీఈఓ తిరుమలచైతన్య
పాలకొండ రూరల్: ప్రభుత్వం ఉపాధ్యాయులకు అందిస్తున్న శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా విద్యా శాఖాధికారి ఎస్.తిరుమలచైతన్య అన్నారు. స్థానిక తమ్మినాయుడు విద్యా సంస్థల్లో డీఎస్సీ–2018 ఉపాధ్యాయులకు శుక్రవారం వృత్యంతర శిక్షణ తరగతులు నిర్వహించారు. జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్టం, బహుళ తరగతుల బోధన, నిర్మాణాత్మక అభ్యసనం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారిణి ఆర్.విజయకుమారి, జి.వి.రమణ, రిసోర్స్ పర్సన్లు సీహెచ్ సంతోష్‌కుమార్, ఉషారాణితో పాటు పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం, బూర్జ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


