ఓట్లప్పుడే బీసీలు గుర్తొస్తారా బాబూ? | - | Sakshi
Sakshi News home page

ఓట్లప్పుడే బీసీలు గుర్తొస్తారా బాబూ?

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

పరిగి: ‘‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎప్పుడో సాధారణ ఎన్నిక సమయంలో హామీ ఇచ్చావు. ఇన్నాళ్లూ దాని గురించే మరచిపోయావు. మళ్లీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుంటే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని బయటకు తీశావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో భాగస్వామిగా ఉన్న నువ్వు రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించు..లేదంటే డ్రామాలు కట్టిపెట్టు’’ అని చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆమె పరిగి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించే కేసును సుప్రీంకోర్టు కొట్టి వేస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసన్నారు. అయినా బీసీల ఓట్ల కోసం ఆయన ఢిల్లీలో అందరినీ కలుస్తూ నాటకం రక్తి కట్టించారన్నారు. జీఓతో రిజర్వేషన్‌ రాదని తెలిసినా కోర్టులకు వెళ్లడం బీసీలను వంచించడమేనన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సమయంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ సాక్షిగా తీర్మాణం చేస్తే... బీసీ వర్గాలు తమకు ఎక్కడ దూరమవుతాయోనన్న భయంతో చంద్రబాబు కుట్ర చేశారన్నారు. తన పార్టీ కార్యకర్త ప్రతాప్‌రెడ్డితో సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేయించారని ఉషశ్రీచరణ్‌ గుర్తు చేశారు. కానీ వైఎస్‌ జగన్‌ ఓపెన్‌ స్థానాల్లోనూ బీసీ వర్గాలకు ఇచ్చి న్యాయం చేశారన్నారు. అలాగే బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. కానీ బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక...బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోర్టులకు ఎక్కడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు డ్రామాలు ఆపి...నిజంగా బీసీల సంక్షేమాన్ని కాంక్షిస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఒప్పించి రాజ్యాంగ సవరణ చేయించాలన్నారు.

బీసీ సంక్షేమశాఖ మంత్రి రోజుకోమాట

బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవిత రిజర్వేషన్లపై రోజుకో మాట మాట్లాడుతున్నారని ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే బీసీ కార్డు ఉపయోగించి మాటతప్పడం సిగ్గుచేటన్నారు. ఏరుదాటాక తెప్ప తగలేయడం మానుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇళ్లు, పింఛన్లు ఇస్తామని నమ్మబలికించి మరోసారి మోసానికి తెరతీరంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ నరసింహమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ

ఎందుకు చేయించలేదు

మోదీతో కలిసి ఉండి లాభమేమిటి?

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీచరణ్‌ మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement