ధర్మవరం: హాకీలో ధర్మవరం క్రీడాకారులు సత్తా చాటారు. హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నగరంలో జరగనున్న 16వ జాతీయస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నీకి ప్రశాంత్, నవీన్‌కుమార్, మహమ్మద్ రఫి ఎంపికయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. అలాగే జట్టుకు కోచ్‌గా శ్రీసత్యసాయి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ హాకీ కోచ్ హస్సేన్ వ్యవహరించనున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్ తెలిపారు.


