‘ఉపాధి’ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కూలీ మృతి

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

చెన్నేకొత్తపల్లి (కనగానపల్లి): చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో శుక్రవారం ఉపాధిహామీ పనులకు వెళ్లిన ఒక కూలీ అస్వస్థతకు గురై మృతి చెందాడు. కూలీలు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ (51) ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో జరుగుతున్న పనులకు వెళ్లాడు. కూలీలతో కలసి ఫారంపాండ్‌ తవ్వుతుండగా తీవ్ర అస్వస్థతకు గురైనాడు. వెంటనే తోటి కూలీలు అతడిని ఇంటికి తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఎలుగుబంటి దాడిలో

యువకుడికి గాయాలు

రాయదుర్గం రూరల్‌: పల్లేపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లిన ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. బాధితుడి బంధువులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చంద్రయ్య, నాగలక్ష్మి దంపతుల కుమారుడు అఖిల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు రోజులాగే వాకింగ్‌ వెళ్లారు. గ్రామ పరిసరాల్లోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ సమీపంలో ఒక్కసారిగా ఎలుగుబంటి వారిపైకి దూసుకొచ్చింది. ఘటనలో అఖిల్‌ చేయి, ముక్కు, తలకు గాయాలయ్యాయి. మిగిలిన ఇద్దరు తప్పించుకుని కేకలు వేశారు. సమీపంలో ఉన్న రైతులు, గ్రామస్తులు రావడంతో ఎలుగుబంటి అడవిలోకి పారిపోయింది. గాయపడిన అఖిల్‌ను హుటాహుటిన రాయదుర్గం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం తీసుకెళ్లారు.

విద్యుదాఘాతంతో కార్మికుడికి గాయాలు

అనంతపురం టౌన్‌: విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. నగరంలోని డీ1 విద్యుత్‌ సెక్షన్‌ భవాని నగర్‌లో విద్యుత్‌ పనులు చేస్తుండగా 11కేవీ విద్యుత్‌ తీగలు తగిలి గుంతకల్లు మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన విజయ్‌నాయక్‌ స్తంభం పైనుంచి కిందపడి గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కార్మికుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు.

బాలిక అదృశ్యం

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్‌ బాలిక రెండు రోజులుగా కనిపించకుండా పోవడం స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన్నట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాలిక ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చుట్టు పక్కల గ్రామాల్లో గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement