నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను బలోపేతం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను బలోపేతం చేస్తాం

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

ప్రశాంతి నిలయం: సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను బలోపేతం చేసి సమాజంలో మార్పునకు శ్రీకారం చుడతామని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌ రాజు తెలిపారు. శ్రీసత్యసాయి నైపుణ్యాభివృద్ధి సంస్థల అఖిల భారత సమావేశం శుక్రవారం ప్రశాంతి నిలయంలో ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలనతో అఖిల భారత సదస్సును ప్రారంభించిన ఆర్‌జే రత్నాకర్‌ రాజు మాట్లాడుతూ, 1970 దశకంలో సత్యసాయి యువతకు నైపుణ్యాలను అందించి, వారిని స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు వృత్తి విద్యా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుత సామాజిక, ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆ కార్యక్రమాల ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. పుట్టపర్తిలో ఇటీవల నిర్వహించిన 40 రోజుల ట్యాలీ, జీఎస్టీ శిక్షణ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. అనంతరం ఆయన అఖిల భారత శిక్షణ సదస్సులో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో జాతీయ సేవాదళ్‌ కోఆర్డినేటర్‌ కోటేశ్వరరావు, జాతీయ సేవా కోఆర్డినేటర్‌ శశిబాల, శరవణ, నేషనల్‌ డిప్యూటీ యాక్టివిటీ ఇన్‌చార్జ్‌–స్కిల్‌ డెవలప్‌మెంట్‌, సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత సదస్సులో రత్నాకర్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement