జూద స్థావరంపై పోలీసుల మెరుపుదాడి | - | Sakshi
Sakshi News home page

జూద స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

తనకల్లు: మండల పరిధిలోని కొర్తికోట గ్రామ శివారు ప్రాంతాల్లో జూద కేంద్రంపై పోలీసులు ఆదివారం మెరుపుదాడి చేశారు. కదిరి రూరల్‌ సీఐ నాగేంద్ర, తనకల్లు, నల్లచెరువు ఎస్‌ఐలు దిలీప్‌కుమార్‌, మక్బూల్‌ బాషా సిబ్బందితో జూద స్థావరంపై దాడి చేసి, పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2,06,400 నగదు, 13 ద్విచక్ర వాహనాలు, 21 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు.

పాముకాటుతో

మహిళ మృతి

నల్లచెరువు: మండలంలోని పి. కొత్తపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడీయా యాక్టివిస్టు యుగంధర్‌రెడ్డి తల్లి పార్వతమ్మ (53) ఆదివారం మృతి చెందింది. వివరాలు.. పార్వతమ్మ శనివారం సాయంత్రం పొలం వద్ద పనులు చేస్తుండగా రెండు కాళ్లకు పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కదిరి ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పార్వతమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలో మృతిచెందింది.

పూల శ్రీనివాసరెడ్డి నివాళి..: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పూలశ్రీనివాసరెడ్డి స్థానిక నాయకులతో కలిసి పి.కొత్తపల్లి గ్రామానికి వెళ్లి పార్వతమ్మ మృతదేహం వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు. యుగంధర్‌రెడ్డి, కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

పెనుకొండ: సోమందేపల్లి మండలం సుద్దకుంటపల్లి గ్రామ శివారులో మల్లికార్జున (42) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వివరాలు.. రొద్దం మండలం రొద్దకంపల్లికి చెందిన బోయ మల్లికార్జున సుద్దకుంటపల్లి సమీపంలో కంది సాగుకు పొలాన్ని లీజుకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం భూమిని దుక్కి చేస్తుండగా, కిందనే వేలాడుతున్న విద్యుత్‌ వైరు ట్రాక్టర్‌కు తగిలింది. దీంతో ట్రాక్టర్‌ తోలుతున్న మల్లికార్జున షాక్‌కు గురై కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవస్వామి కుంభాభిషేకం

ధర్మవరం: పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి 24 వరకు కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ చెన్నంశెట్టి జగదీశ్వరప్రసాద్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

పీఏబీఆర్‌ జలాశయంలో తగ్గిన నీటి మట్టం

కూడేరు: మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 2.1 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్‌ అధికారులు ఆదివారం తెలిపారు. డ్యాంలోకి ఇన్‌ప్లో లేదు. పీఏబీఆర్‌ డ్యాం వద్ద ఉన్న శ్రీరామిరెడ్డి, అనంత, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 55 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి, లీకేజీ రూపంలో మరో 75 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. అవుట్‌ ఫ్లో మాత్రమే ఉండడంతో నీటి మట్టం రోజు రోజుకూ తగ్గిపోతోంది. నీటి మట్టం తక్కువున్నా తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ఇబ్బంది లేదని డ్యాం ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement