కదిరి టౌన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే వరకు పోరాటం చేస్తామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కదిరి మున్సిపల్ పరిధిలోని మాదవ గురుకులం పాఠశాల ఆవరణలో వాల్మీకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వాల్మీకి సంఘం నాయకుడు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సంఘం నాయకుడు బూదిలి సుదర్శన్ అధ్యక్షతన జరిగిన సమావేశనికి ముఖ్య అతిథిగా పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం సీనియర్ నాయకులు కొట్టాల శ్రీరాములు, కర్ణాటక రాష్ట్ర వాల్మీకి సంఘం మహిళా అధ్యక్షురాలు మంజుల హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని వాల్మీకులను ఎస్టీలుగాను, మన రాష్ట్రంలో వాల్మీకులను బీసీలుగా గుర్తించడంతో వాల్మీకులు అన్ని రకాలుగా వెనుకబడ్డారన్నారు. వాల్మీకి సంఘం నాయకులు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతి వారం తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు నారాయణస్వామి, సోమశేఖర్, గోరంట్ల ఆదినారాయణ, అనిత, వాల్మీకి సంఘం నాయకులు గంగరాజు, ప్రసాద్, నాగరాజు, బొట్టుచంద్ర, మహేష్, కాళసముద్రం హరికృష్ణ, సురేష్, నరసింహులు, లోకేష్, జయసంహ, గోపాల్, మహిళా నాయకురాలు నాగేశ్వరి, సునంద వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు


