మడకశిర మండల పరిధిలోని గౌడనహళ్లి న్యూ ఎస్సీ కాలనీకి తాగునీరు సరఫరా కాక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వేసిన బోరు నీరు లేక ఒట్టిపోయింది. మరోబోరు వేసినా అరకొర నీరే పడ్డాయి. నూతన బోరుకు ఏర్పాటు చేసిన మోటరు ఇటీవల చెడిపోయింది. దీంతో తాగునీటికోసం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా మా కష్టాలు ఎవరికీ పట్టడం లేదు.
– నరసింహ , గౌడనహళ్లి,
మడకశిర మండలం
నెలరోజులైనా మరమ్మతు చేయలేదు
మా గ్రామంలో 1,350 మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వం రక్షిత మంచినీటి పథకం కింద గ్రామంలో రెండు బోరుబావులు తవ్వించింది. ప్రస్తుతం ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మరో బోరుబావి వినియోగంలో లేక నెల రోజులు కావొస్తున్నా.. అధికారులు మరమ్మతు చేయించలేదు. అర్జీలిస్తే తీసుకుని చెత్తబుట్టలో పడేస్తున్నారు.
– ఎం.నాగరాజు, టీడీపల్లి గ్రామం,
రొళ్ల మండలం


