హామీల అమలుకు ఉద్యమిస్తాం
సీఎం చంద్రబాబు నాయుడు చేనేత దినోత్సవం సాక్షిగా చేనేత మగ్గాల కార్మికులకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. జీఓ అమలు చేసి మిన్నకుండిపోయారు. ఇక నేతన్న భరోసా సాయం అందిస్తామని, జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు అప్పుల బాధలు, ఆత్మహత్యలే మిగిలాయి. జిల్లాకు ఒక చేనేత మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రుత్రి ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ప్రభుత్వం హామీలు అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తాం.
– వెంకటనారాయణ, ఏపీ చేనేత కార్మిక
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ధర్మవరం


