
సాయి మార్గం.. ఆచరణీయం
ప్రశాంతి నిలయం: సత్యసాయి చాటిన విలువలు నవసమాజ నిర్మాణానికి సోపానాలని, అందరూ వాటిని ఆచరించాలన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించిన నాటిక భక్తకోటిని అనందపరవశులను చేసింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ జోన్ –6 దేశాలకు చెందిన బాలవికాస్ చిన్నారులు శనివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి చాటిన ఆధ్యాత్మిక, మానవతా విలువలు, సత్యసాయి విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యతను వివరిస్తూ చిన్నారులు ప్రదర్శించిన నాటిక భక్తులను ఆకట్టుకుంది.