
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
అబార్షన్ కారణంగా తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా అబార్షన్ చేయించుకుంటే రక్తహీనత ఏర్పడి ప్రాణం మీదకు వస్తుంది. ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశమూ లేకపోలేదు. భవిష్యత్తులో మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చినా గర్భ సంచి, ట్యూబ్స్, అండాశయానికి ఇన్‌ఫెక్షన్లు వచ్చి అబార్షన్ అయ్యే అవకాశం ఉంది. అర్ధంతరంగా అబార్షన్ చేయించుకుంటే మళ్లీ గర్భం దాల్చే అవకాశాలు తక్కువవుతాయి.
– డాక్టర్ షంషాద్‌బేగం, గైనిక్ విభాగం హెచ్‌ఓడీ, అనంతపురం సర్వజనాస్పత్రి