
నాన్నే ఆదర్శం
ఎవరి జీవితాలకై నా అర్ధం పరమార్ధం చెప్పేది కచ్చితంగా తండ్రే అని నా అభిప్రాయం. మేము ఎమ్మిగనూరు సమీపంలోని గుడికల్లు గ్రామంలో చదువుకున్నాం. నాన్న తుంబళం ఎల్లప్ప మాకు ఒకటే చెప్పేవారు. చదువు ఎంత ముఖ్యమో పదిమందికి అన్నం పెట్టే వ్యవసాయమూ అంతే ముఖ్యం అని. నేను సేద్యం పూర్తిగా నేర్చుకుంటూనే పోలీసు వృత్తిలోకి వచ్చినా.. తమ్ముడిని మాత్రం వ్యవసాయంలో ఉండేలా నాన్న చూసుకున్నాడు. గౌరవంగా జీవించే లక్షణాలను నేర్పిన నాన్నే మాకు ఆదర్శం.
–టి.వెంకటేశులు,
అనంతపురం రూరల్ డీఎస్పీ

నాన్నే ఆదర్శం