
●నాన్న ప్రోత్సాహంతోనే సామాజిక సేవ
అనంతపురానికి చెందిన సుంకర నవని కేంద్రీయ విద్యాలయంలో మూడో తరగతి చదువుతోంది. ‘అనంత’ను హరితవనంలా మార్చాలన్న తపనతో ఏడాదికి పైగా వందలాది మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంది. తల్లి పేరు మీద మొక్క (ఏకే పేడ్ మా కే నామ్) నాటాలన్న కేంద్రప్రభుత్వ సూచనల మేరకు మొక్కలు నాటి సంరక్షిస్తున్న నవని.. మరో రెండురోజుల్లో దేశ రాజధానిలో జరిగే సమావేశానికి ఎంపికై ంది. తానింతటి ఘనత సాధించటానికి తన తండ్రి సుంకర రమేష్ ఇస్తున్న ప్రోత్సాహమేనని చెబుతోంది. నాన్న నా వెన్నంటి ఉంటూ చదువుతో పాటు సామాజిక సేవ గురించి చెబుతూ ముందుకు నడిపిస్తున్నాడని మురిసిపోతోంది.
మా నాన్న తలారి శ్రీనివాస్ చిరుద్యోగి. కళలంటే ఆసక్తి ఎక్కువ. ఆయన చిన్నప్పుడుడెప్పుడో కలలు కనేవారంట. తన కూతురిని పెద్ద సింగర్‌ను, డాన్సర్‌ను చేయాలని. నా చిన్నప్పటి నుంచి అదే చెప్పేవాడు. నాకు మా నాన్నంటే ఎంత ఇష్టమో ఆయన కోసం అదే ఇష్టాన్ని సంగీతం, శాసీ్త్రయ నృత్యంపై పెట్టి మెలకువలు నేర్చుకుంటున్నా. సీనియర్ గాయకులతో కలిసి వేదిక పంచుకున్నా. పాడుతున్నప్పుడైనా, నాట్యం చేస్తున్నప్పుడైనా నాన్న ఇష్టమే గుర్తొస్తుంది. ఇక కష్టమనేది అనిపించదు. ఇటీవలే దూరదర్శన్‌లో కూడా క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చాను. పిల్లలు ఎదగడానికి ప్రతి నాన్న కొవ్వొత్తిలా మారిపోతుంటారు. హ్యాట్సాఫ్ నాన్న.
– రాజేశ్వరి, సంగీత కళాకారిణి,
అనంతపురం
అనంతపురం కల్చరల్: మనలో ఆనందం నింపి.. అల్లారుముద్దుగా పెంచి.. మనలోని లోపాలను సరిచేస్తూ మన భవితకు పునాదులు వేస్తూ గమ్యానికి దారి చూపేది నాన్న. అనురాగానికి ఆప్యాయతలకు ప్రతీక. తండ్రితో గడిపిన క్షణాలు ప్రతి వ్యక్తి జీవితంలో మఽరచిపోలేని మధురానుభవాలే. పైళ్లె అత్తారింటికి వెళ్లినా ఆడపిల్లకు తండ్రి లాలన పట్లే మక్కువ ఎక్కువ. ఉద్యోగాలొచ్చి ఎక్కడో స్థిఽరపడే మగపిల్లలకై నా సరే తండ్రి నేర్పిన క్రమశిక్షణ వారిని ముందుకు సాగేలా చేస్తుంది. బిడ్డల జీవితాన్ని చేయి పట్టుకు నడిపించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే తండ్రి ప్రాధాన్యతను గుర్తు చేసుకోవడానికి చరిత్ర పుటల్లో ఓ ప్రత్యేక రోజు కేటాయించారు. జూన్‌లో వచ్చే మూడవ ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ‘ఫాదర్స్ డే’గా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనంతపురంతో పాటు పలు చోట్ల ఫాదర్స్ డే సంబరాలు వేడుకగా జరుగనున్నాయి.
మేము చిన్నప్పుడు తిరుపతి సమీపంలోని పూతలపట్టు గ్రామంలో ఉండేవాళ్లం. నాన్న గోవిందయ్య వృత్తిరీత్యా ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ పుత్తూరులో ఉంటే మా చదువు అక్కడే సాగింది. మేము ముగ్గురు అన్నదమ్ములైతే చిన్నతనం నుంచి నాన్న ఇచ్చిన స్ఫూర్తితో బాగా చదివి ఇద్దరం డాక్టర్లయ్యాం. అన్నయ్య ఆర్టీసీలో పనిచేస్తున్నారు. మూడేళ్ల కిందట మెడికల్ ఆఫీసర్‌గా జిల్లాకొచ్చాను. ఉన్నతస్థాయిలో స్థిరపడడానికి మాకన్నా నాన్నే ఎక్కువగా కష్టపడ్డారంటే ఆశ్చర్యం లేదు. అందుకే మా హీరో ఎప్పటికీ నాన్నే.
– డాక్టర్ ముత్తురేవుల శివకృష్ణ, మెడికల్ ఆఫీసర్, రాప్తాడు
నాన్న కల నెరవేర్చా
ఉజ్వల భవితకు పునాది వేశారు

●నాన్న ప్రోత్సాహంతోనే సామాజిక సేవ

●నాన్న ప్రోత్సాహంతోనే సామాజిక సేవ

●నాన్న ప్రోత్సాహంతోనే సామాజిక సేవ