చిలమత్తూరు: స్థానిక పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబులును వీఆర్‌కు పంపినట్లుగా సమాచారం. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు సదరు కానిస్టేబుల్ కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేసేందుకు కారులో వెళుతూ వీరాపురం సమీపంలో ఎస్‌ఐ కంటపడ్డారు. ఆ సమయంలో ఆయన పిలిచినా స్పందించకుండా కారును తిప్పి శరవేగంగా దూసుకెళ్లాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ద్విచక్ర వాహనదారుడిని ఆపి కారును వెంబడించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వాహనం నడుపుతున్న వ్యక్తిని బైక్ ఎవరదని ప్రశ్నించడంతో సదరు కానిస్టేబుల్ పేరు తెలిపాడు. కాగా, ఘటన జరిగిన తర్వాత రెండు రోజులుగా సదరు కానిస్టేబులు విధులకు డుమ్మా కొట్టాడు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎస్‌ఐ తీసుకెళ్లడంతో వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.