
లంకాదహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఈఓ భద్రాజీ, సిబ్బంది
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో 3 రోజులుగా సాగుతున్న ఉగాది ఉత్సవాలు గురువారం లంకాదహనం కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. లంకాదహనం వేడుకను వీక్షించడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ముందుగా ఆంజనేయస్వామిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి కాశీవిశ్వేశ్వరాలయం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఈఓ భద్రాజీ ఆధ్వర్యంలో కాశీవిశ్వేశ్వరుడితో ఆంజనేయస్వామికి పూజలు చేశారు. వేదగోష్టి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి చేతుల మీదుగా లంకా దహనం వేడుక ప్రారంభించారు. అయ్యప్ప క్రాకర్స్ వారు అందించిన టపాసులతో దాదాపు రెండు గంటలపాటు లంకా దహనం సాగింది.
కసాపురంలో ముగిసిన
ఉగాది ఉత్సవాలు

ఆంజనేయస్వామిని ఊరేగిస్తున్న దృశ్యం