నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షు డు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో మాజీ జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు.
కశ్మీర్ మారఽథాన్–2026కు క్రీడాకారులకు ఆహ్వానం
నెల్లూరు (టౌన్): ిఫట్నెస్, స్పోర్ట్స్ టూరిజం, యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే ఉద్దేశంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శ్రీనగర్లో ఈ నెల 25న నిర్వహిస్తున్న మూడో ఎడిషన్ కశ్మీర్ మారథాన్–2026 పోటీలకు క్రీడాకారులను ఆహ్వానిస్తోందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం పాండురంగారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మారథాన్ విభిన్న రాష్ట్రాల క్రీడాకారుల భాగస్వామ్యంతో ఏక్ భారత్ శ్రేష్ట భారత్ స్ఫూర్తిని చాటి చెప్పడమే కాకుండా క్రీడాకారుల మధ్య పరస్పర సత్సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఇందులో వివిధ విభాగాల్లో మొత్తం 56 బహుమతులను అందజేయనున్నారని తెలిపారు. మారథాన్ విజేతగా నిలిచిన (పురుషులు, మహిళలకు విడివిడిగా) రూ.25 లక్షలు, హాఫ్ మారథాన్ విజేతలకు రూ.15 లక్షలు నగదు బహుమతులు అందజేస్తారని చెప్పారు. జిల్లాలోని అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్లు, అఫిలియేటెడ్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్స్, కోచ్లు, అథ్లెటిక్స్, క్లబ్స్, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు కోసం https:// kashirmarathon.jk.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
జిల్లాలో 184
ఉపాధ్యాయ పోస్టులు
నెల్లూరు (టౌన్): కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ను మంగళవారం అర్ధరాత్రి హడావుడిగా విడుదల చేసింది. జిల్లాలో వివిధ విభాగాల్లో మొత్తం 184 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపారు. జిల్లా వ్యాప్తంగా 100 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 65 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 8, సెకండరీ గ్రేడ్ టీచర్లు 11 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ను విడుదల చేశారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
జెడ్పీ సీఈఓ
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ నూతన సీఈఓగా ఎస్ మధుసూదన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ హిమాన్షుశుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా నూతన సీఈఓను డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య, జెడ్పీ అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఎన్నికల నిర్వహణపై సమీక్ష
నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ మధుసూదన్ స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక కేంద్రాలు, ఎన్ని కల సామగ్రి తదితర అంశాలపై చర్చించారు.
అలివి వలలతో
చేపలు వేటాడితే చర్యలు
సోమశిల: సోమశిల జలాశయంలో అలివి వలలతో చేపలను వేటాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు హెచ్చరించారు. సోమశిల జలాశయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. జలాశయంలో చేపల వేట సాగించే జాలర్లతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన స్థానిక మత్స్యకారులు మాత్రమే సంప్రదాయ వలలతో వేట సాగించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి స్థానికేతరులు, అలివి వలలతో వేట సాగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్డీఓ సురేష్ బాబు ఉన్నారు.


