స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

● వైఎస్సార్‌సీపీపై ప్రజలకు నమ్మకం

● చంద్రబాబు పాలనపై తీవ్రవ్యతిరేకత

● ప్రతిపక్ష నేతలను పోలీసులు వేధిస్తున్నారు

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ముత్తుకూరు(పొదలకూరు) : ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన, చంద్రబాబు పాలనను బేరీజు వేసుకుంటున్న ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.స్థానిక పోరుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలి.కష్టపడితే విజయం మనదే’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ముత్తుకూరుతో పాటు వెంకటాచలం మండలం సరస్వతీనగర్‌లో బుధవారం కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రజలు సంక్షేమ ఫలాలు అనుభవించారని, చంద్రబాబు వాటిని ప్రస్తుతం అందివ్వలేకపోతున్నారని విమర్శించారు. కూటమి పాలనలో గ్రామాలకు వెళితే అవినీతి, అక్రమాలు తప్పించి అభివృద్ధి జాడ ఎక్కడా కనిపించడం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో పరువు నిలుపుకొనేందుకు ఏదోక రకంగా విజయం సాధించాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అధికార పార్టీ సూచనలతో ప్రతిపక్ష నాయకులకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, బైండోవర్‌ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని కాకాణి కోరారు. ఇదే అంశంపై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించడం జరిగిందన్నారు. అడ్డగోలుగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తిరగబడతారని, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలన ధర్మబద్ధంగా సాగడం లేదని, భయబ్రాంతులకు గురిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేందుకు కృషి చేయాలని సూచించారు. కాకాణి వెంట నాయకులు నెల్లూరు శివప్రసాద్‌, మందల వెంకటశేషయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement