యువకుడ్ని బలిగొన్న ఇసుక ట్రాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

యువకుడ్ని బలిగొన్న ఇసుక ట్రాక్టర్‌

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

విడవలూరు: కూరగాయలు తీసుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్న యువకుడ్ని ఇసుక ట్రాక్టర్‌ బలిగొంది. ఈ విషాదకర ఘటన రామతీర్థంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు..కావలి మండలం తుమ్మలపెంట గ్రామానికి చెందిన యల్లంగారి అశోక్‌ (18) విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెంలోని తన బంధువుల రొయ్యల గుంతల వద్ద కాపలాదారుడిగా పనిచేస్తున్నా డు. బుధవారం రాత్రి బైక్‌పై రామతీర్థం వచ్చి కూరగాయలు తీసుకుని తిరిగి గుంతల వద్దకు వెళ్తున్న క్రమంలో గాజులమ్మ గుడి సమీపంలో బైక్‌ను ఎదురుగా వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. అటుగా వెళ్తున్న వారు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్సై ఉప్పు సాయి కళ్యాణ్‌ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement