కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

● మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి

● వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

కొడవలూరు: ‘కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో అనేకమంది స్థానిక ఎన్నికల వేళ భారీగా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ముందుకొస్తున్నారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలోని రామన్నపాళెం నుంచి నాయకులు, యువకులు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరు నెల్లూరులోని మాజీ మంత్రి, ఆ పార్టీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంలో బుధవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమరంలో వైఎస్సార్‌సీపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో ఉలవపాటి శ్రీహరి, పానేటి వెంకటరమణయ్య, గంగపట్నం బుల్లయ్య (చిన వెంకయ్య), తలారి మధు, కల్లు ప్రసాద్‌, కందల విజయ్‌, ఉలవపాటి పవన్‌, టి.వెంకటేశ్వర్లు, మొలతాటి మురళి, పందిటి రవికుమార్‌, మనోజ్‌, నరేష్‌, శివ, నాగరాజు,మోహన్‌ తదితరులున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి పార్టీ పరిశీలకుడు వీరి చలపతిరావు, పార్టీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరి, రామన్నపాళెం గ్రామ అధ్యక్షుడు కాకి సుమన్‌, నాయకుడు కరేటి శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement