● పది మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మండల వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తూపిలిపాళెం తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సంద్రం సుమారు 10 మీటర్లు మేర ముందుకు రావడంతో మత్స్యకారులు అప్రమత్తమయయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చేపల వేటను నిలిపివేశారు.
కండలేరులో 16.924 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 16.924 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 133, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


