భూములకు హద్దులు చూపడంలేదు | - | Sakshi
Sakshi News home page

భూములకు హద్దులు చూపడంలేదు

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

తెలుగుగంగ ముంపు ప్రాంతంలో మా భూములను కోల్పోయాం. ఈ తరుణంలో మూడెకరాలను కుటుంబపెద్ద రామకృష్ణయ్య పేరుతో కలువాయి మండలం తెలుగురాయపురంలో 1990లో ప్రభుత్వమిచ్చింది. 1బీ, అడంగల్‌, పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నాయి. అన్నదాత సుఖీభవ నిధులు సైతం జమవుతున్నాయి. పంటలు సక్రమంగా పండకపోవడంతో ఉపాధి నిమిత్తం కావలికి వెళ్లాం. ఇదే అదనుగా చూసిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి మా పొలంలోని చెట్లను కొట్టేసి హద్దుల్లేకుండా చేశారు. పైగా ఆయనకు పట్టాను తహసీల్దార్‌ ఇచ్చారని తెలుస్తోంది. విషయం తెలిసి తహసీల్దార్‌ను కలిసి భూములకు హద్దులు చూపాలని వేడుకొని చలానాను కట్టాం. కుటుంబపెద్ద అనారోగ్యంతో మృతి చెందారు. అయినా కనికరించడం లేదు. అర్జీని కలెక్టరేట్లో మూడోసారి అందజేస్తున్నాం. ఇప్పటికై నా న్యాయం చేయాలి.

– గుడుగుంట సరోజనమ్మ, కుమారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement