● ఇప్పటికై నా పరిష్కరించండయ్యా..
● కలెక్టరేట్కు పెద్ద సంఖ్యలో వచ్చిన
అర్జీదారులు
నెల్లూరు(అర్బన్): ఒకే సమస్యపై ఎంపీడీఓలు, తహసీల్దార్ల చుట్టూ తిరిగి.. తిరిగి అలసిపోయాం.. అయినా ఇవి పరిష్కారానికి నోచుకోవడంలేదు.. ఇక్కడైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చాం.. మీరైనా మా మొరను ఆలకించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అర్జీలను సమర్పించారు. వీటిని కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు స్వీకరించారు.
పరిహారమింకా ఇవ్వలేదు
చిల్లకూరు మండలం చింతవరంలోని నా పొలంలో నాలుగెకరాల్లో 1.23 ఎకరాలను సాగరమాల ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం తీసుకుంది. విచారణను కలెక్టర్ జరిపించారు. అయితే పరిహారాన్ని ఇప్పటికీ ఇవ్వలేదు. తక్షణమే చెల్లించేలా కలెక్టర్ చర్యలు చేపట్టాలి
– జనార్దన్, రవి,
మల్లాం, చిట్టమూరు మండలం


