నెల్లూరులో కాలువ కట్టలపై నివసించే ప్రజలకు పట్టాలిచ్చామని సీఎంతో పాటు మంత్రి నారాయణ, టీడీపీ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత సర్కార్ ఇస్తున్న పట్టాలను కలుపుకొంటే 50 వేలకుపైగా ఉన్నాయి. పేదలకు హక్కులు దక్కాలన్నా.. అమ్ముకోవాలన్నా వీటిని శాశ్వత పట్టాలుగా మార్చాలి. ఇప్పుడిచ్చే వాటితో బ్యాంక్ రుణాలను ఇవ్వరు. ఇలాంటి వాటిని రిజిస్ట్రేషన్ పట్టాలుగా మార్చేందుకు కృష్ణా జిల్లాలో జీఓను తెచ్చారు. ఇదే తరహాలో ఇక్కడా వ్యవహరించాలి. నగరంలో కొంత మందికిచ్చి, మరికొందరికి రిక్తహస్తం చూపుతున్నారు.
– మాదాల వెంకటేశ్వర్లు, సంపత్,
సీపీఎం నేతలు


