● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: పోలేరమ్మ తల్లి కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఆమె ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కాంక్షించారు. పోలేరమ్మ తల్లి జాతర చివరి ఘట్టం మూడో రోజున అమ్మవారిని ఆయన గురువారం దర్శించుకున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, బాణాసంచాతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడారు. 90 ఏళ్ల తర్వాత జాతరను అందరూ ఏకతాటిపై నిలిచి నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పోలేరమ్మ సంకల్పం, ఆశీస్సులతోనే జాతర దిగ్విజయంగా జరిగిందని చెప్పారు. వైభవంగా నిర్వహించిన భక్తులు, నిర్వాహకులను అభినందించారు. నేతలు పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, వాకాటి శ్రీనివాసులురెడ్డి, లక్ష్మీకల్యాణి, రావుల ఇంద్రసేన్‌గౌడ్, వేణుగోపాల్‌రెడ్డి, అంజద్, సతీష్‌రెడ్డి, ఆకుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


